సౌత్ ఇండస్ట్రీలోనే సత్తా చాటుతున్నటువంటి హీరోయిన్స్లలో త్రిష కూడా ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు 41 ఏళ్లు ఆయన ఇంకా వివాహం చేసుకోలేదు. కుర్ర హీరోయిన్లకు దీటుగా తన అందంతో ఇప్పటికే అందర్నీ మాస్మరైజ్ చేస్తూనే ఉంది త్రిష. ఇలా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన త్రిష ఎక్కువ చిత్రాలలో నటించింది. త్రిష 22 ఏళ్లుగా హీరోయిన్ గానే నటించి ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.



మొదట అమీర్ డైరెక్షన్లో వచ్చిన మౌనం పసియేట్  అనే చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా వచ్చిన త్రిష ఆ తర్వాత అన్ని భాషలలో అడుగుపెట్టింది. టాలీవుడ్ లో కూడా ప్రభాస్, ఎన్టీఆర్ ,మహేష్ బాబు ,చిరంజీవి వంటి హీరోలతో కూడా నటించింది. అయితే త్రిష గత కొద్దిరోజులుగా పొలిటికల్ ఎంట్రీ పై వార్తలు వినిపిస్తూ ఉన్న సమయంలో త్రిష తల్లి క్లారిటీ ఇవ్వడం జరిగింది. తన కూతురు ఎటువంటి రాజకీయాలలోకి వెళ్లలేదని ఆమె సినిమాలను ఎప్పుడు విడిచి పెట్టదని కూడా వెల్లడించడం జరిగింది.


ఈ విషయం విన్న అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజము లేదని కేవలం కావాలనే కొంతమంది ఇలాంటి రూమర్స్  సృష్టిస్తున్నారంటూ త్రిష తల్లి క్లారిటీ ఇవ్వడం జరిగింది. త్రిష ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే అజిత్ కి జోడిగా గుడ్ బ్యాడ్ అగ్లీ, అలాగే హీరో కమలహాసన్ తో థగ్ లైఫ్, చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాతో పాటుగా సూర్య 45, విజయ్ సేతుపతి 96 పార్ట్2 ఇలా తదితర చిత్రాలలో నటిస్తున్నది. మరి ఇప్పటివరకు రాజకీయాలపై త్రిష తల్లి క్లారిటీ ఇవ్వగా మరి త్రిష ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: