స్టోరీ విషయానికి వస్తే.. ఎంజీఆర్ మదగజరాజ.(విశాల్) ఒక చిన్న ఊరిలో కేబుల్ టీవీ నడిపిస్తూ ఉంటారు. తన తండ్రి రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న సమయంలో ఇన్స్పెక్టర్ గా ఒక కేసులో జైలు శిక్ష అనుభవించినటువంటి నేరగాడికి ప్రాణాపాయం ఉందని తెలిసి ఆ నేరగాడినీ సేఫ్ గా తీసుకువస్తారు రాజ. అయితే ఆ నేరస్తుడి కూతురే మాధవి (అంజలి). వీరిద్దరిని తమ ఇంట్లోనే ఉండేలా చేస్తారు.ఆ తర్వాత అటు మాధవి ,రాజా ఇద్దరు ప్రేమించుకుంటారు. ఆ తర్వాత అటు మాధవి తండ్రి, రాజ తండ్రిమధ్య గొడవ అవుతుందట. దీంతో వారు వెళ్ళిపోతారు.
అలాంటి సమయంలో చిన్ననాటి స్నేహితుడు అయిన మాస్టర్ ఇంట్లో పెళ్లికి ఆహ్వానం రావడంతో అందరూ అక్కడికి వెళ్తారు.. ఆ తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో తన స్నేహితులు ఇబ్బందులు ఉన్నారని తెలుసుకున్న రాజ అందుకు కారణం ఒక పొలిటిషన్ హస్తం ఉంటుందని తెలియడంతో ఆ పొలిటిషన్ కి బుద్ధి చెప్పడానికి స్నేహితులతో కలిసి రాజా ఏం చేస్తారు అనే విషయమే ఈ సినిమా..
ఇందులో విశాల్ అద్భుతమైన నటనను కనబరిచారు.. తెలుగులో చాలా కాలంగా నిరాశపరిచిన విశాల్ ఈ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నారు. డైరెక్టర్ సుందర్ సి కూడా అద్భుతమైన కామెడీ సినిమాలు తెరకెక్కించారు. సంతానం, విశాల్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు హైలెట్ గా ఉన్నాయి. మనోభాల ఈ సినిమాలో మరోసారి అద్భుతంగా నటించారు. ఆడియన్స్ కి నవ్వులు పూజించేలా చేశారు. వరలక్ష్మి గ్లామర్ షో ఈ సినిమాలో చూపించినంతగా మరి సినిమాలో కూడా చూపించలేదట. ఈమె కామెడీ కూడా ఇందులో వర్క్ ఔట్ అయ్యింది. మొత్తానికి ఈ సినిమాతో ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చట. ఈ సినిమాకి పెద్ద ప్లస్ కామెడీనే.. మొదటి భాగం సంతానం రెండో భాగం మనోభాల కామెడీతో సినిమాని సక్సెస్ అందించారు.