పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫాన్స్ కి శుభవార్త. త్వరలో ప్రభాస్ స్పిరిట్ సినిమా సెట్ లోకి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఈ మూవీ షూటింగ్ మేలో ప్రారంబించాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారు. సందీప్ వంగా ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, రష్మిక మందన్నలో ఎవరొకరిని తీసుకునేందుకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ సినిమా 2026 సంవత్సరంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా (సందీప్‌రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు.
ఇక ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో డార్లింగ్ లుక్స్ అలాగే ఫిజిక్ కోసం స్పెషల్ గా మెకోవర్ ని నియమించనున్నట్లు సమాచారం. డార్లింగ్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో వరుస హిట్ కొడుతూ.. ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రభాస్ త్వరలో రాజాసాబ్ మూవీతో రానున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా కూడా రానుంది. ఇప్పటివరకు వరుస సినిమాలు హిట్ కొట్టినప్పటికి అన్నింటిలో యాక్షన్ ని మాత్రమే చూశాము.. కానీ డార్లింగ్ ఫౌజీ సినిమాలో లవ్ అలాగే ఎమోషన్ కూడా చూపించనున్నాడు.