సాధారణంగా ఒకే క్వాలిటీ ఇద్దరి వ్యక్తులకు  ఉంటే దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు. అసలు అలా ఎలా ఉంటుంది..? అంటూ సో కాల్డ్ విషయాలని సైతం మాట్లాడుకుంటూ ఉంటారు. అదే క్వాలిటీ బడాబడా స్టార్స్ కి ఉంటే..? ఒకే క్వాలిటీ కామన్ గా ముగ్గురు హీరోయిన్స్ ఉంటే అది ఒక పెద్ద న్యూస్ గా మారిపోతుంది .  జెట్ స్పీడ్ లో నెట్టింట ట్రెండ్ అవుతుంది.


ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో యమ వైరల్ గా మారింది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ముగ్గురు కత్తిలాంటి హీరోయిన్స్ కి ఒకే అలవాటు ఉండటం ఇప్పుడు హైలెట్గా మారింది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.  నేషనల్ క్రష్ గా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని ముందుకు దూసుకెళ్లిపోతుంది. ప్రెసెంట్ రష్మిక మందన్నా ఖాతాలో ఎన్ని బడా సినిమాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే .



కాగా రష్మిక మందన్నా చాలా చాలా స్ట్రిక్ట్ . తాను ఒక డైట్ ని ఫాలో అవుతుంది అంటే అది ఖచ్చితంగా చేస్తుంది.  ఆరోగ్యం బాగున్న బాగో లేకపోయినా.. మరీ ముఖ్యంగా వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తుంది . ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదు అయినా కూడా వ్యాయామాలు చేస్తూనే వస్తుంది . అంత మొండి గలది రష్మిక మందన్నా. కేవలం రష్మిక మందన్నా మాత్రమే కాదు టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటి సంపాదించుకున్న పూజా హెగ్డే అలాగే స్టార్ హీరోయిన్ సమంత కూడా అంతే . డైట్ విషయంలో వ్యాయామాల విషయంలో అస్సలు వెనక్కి తగ్గరు. ఆరోగ్యం బాగో లేకపోయినా సరే వ్యాయామాలు చేస్తూనే ఉంటారు.  ఇలా ఈ ముగ్గురులో ఈ క్వాలిటీ కామన్ గా కనిపిస్తుంది అంటూ జనాల విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. ముగ్గురు కూడా మహా ముదుర్లే ఆ విషయంలో అంటూ నాటీ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: