సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోస్ బాగా ఆకర్షణీయంగా ఆకట్టుకుంటూ ఉంటాయి.  అయితే మరికొన్ని మాత్రం అలా ఎంటర్టైన్ చేయలేకపోవచ్చు . ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం ఎంత సర్వసాధారణమో ..ఒక హీరో చేసిన మూవీ అరెరే నాకు ఈ మూవీ పడి ఉంటే బాగుండేదే అని పక్క హీరో అనుకోవడం కూడా అంతే సర్వసాధారణం . కాగా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అది కూడా గ్లోబల్ ఇమేజ్ దక్కించుకున్న రాంచరణ్ కి సంబంధించిన వార్త కావడంతో మరింత ట్రెండ్ అవుతుంది. 


రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాతో హ్యూజ్ నెగిటివ్ టాక్ సంపాదించుకున్నారు రామ్ చరణ్ . ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తుంది . కాగా  రామ్ చరణ్ చాలా పక్కాగా స్టోరీస్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు . అయితే మహేష్ బాబు కెరియర్ లోనే బాగా జనాలకి నచ్చేసిన మూవీ "భరత్ అనే నేను". ఈ మూవీ రామ్ చరణ్ చేసుంటే బాగుండేది అంటూ ఆశపడ్డారట .



ఆ సినిమాలో సీఎంగా కనిపిస్తాడు మహేష్ బాబు.  ఆ లుక్స్ .. ఆ బాడీ మాడ్యులేషన్స్ బాగా ఆకర్షణీయంగా ఆకట్టుకున్నాయి. అలాంటి ఒక స్టోరీ నాకు వచ్చుంటే బాగుండేది ..ఆ సీఎం లుక్స్ లో నేను కనిపించి ఉంటే బాగుండు అంటూ ఆశపడ్డాడట రామ్ చరణ్ . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాపై చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి . మరి ముఖ్యంగా మహేష్ బాబు కెరియర్ లోనే సెపరేట్ డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన మూవీగా ఈ సినిమా  కూడా నిలిచిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: