విజయాలు ఎక్కువ లేకపోయిన తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన విజయాలు , అపజయాల గురించి పెద్దగా పట్టించుకోకుండా రొటీన్ సినిమాల్లో నటించకుండా వైవిధ్యమైన సినిమాల్లో ఎక్కువ శాతం నటిస్తూ వెళ్లడంతో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు తెలుగు సినిమా పరిశ్రమలో ఏర్పడింది. ఇకపోతే ప్రస్తుతం సందీప్ కిషన్ "మజాకా" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సందీప్ కిషన్ కి జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రీతు వర్మ కనిపించబోతుంది.

ఈ సినిమాకు త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం వహించగా ... ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథను అందించాడు. ఇకపోతే ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ మూవీ లో రావు రమేష్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన నాన్ థియేటర్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు ఓవరాల్ గా సాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల ద్వారా 15 కోట్ల ధర వచ్చినట్లు , అలాగే మ్యూజిక్ అండ్ హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా ఏకంగా 7 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ సినిమాకు నాన్ ధియేటర్ బిజినెస్ 22 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా విడుదలకు ముందే నాన్ థియేటర్ బిజినెస్ ద్వారానే పెద్ద మొత్తంలో డబ్బులు రికవరీ చేసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk