ఈ సినిమా హిట్ అవ్వడానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సాయి పల్లవి ఒక ఎత్తు. ఆమె ఒక సినిమాలో నటిస్తుందంటే చాలు ఆ సినిమా పక్క హిట్ కోడతుందని ముందే ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆమె సినిమాలను సెలెక్ట్ చేసుకునే విధానమే వేరు. అలాగే ఆ సినిమాలో సాయి పల్లవి నటన మామూలుగా ఉండదు. ఇక ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బుజ్జితల్లి పాటతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లో సాయి పల్లవి శ్రీకాకుళం యాసలో ఒక డైలాగ్ చెప్పింది. 'రాజూ.. ఊర్లో అందరూ ఏతేటో మాతాదుకుంతన్నార్రా.. నీకు నాకు ఏతేతో ఉన్నట్టు మాతాదుకుంతన్నార్రా.. ఇప్పుడేంతావే.. అందరూ ఏతో మాతాదుకుంతన్నారు కదా.. అది నిజం చేచేత్తే ఎట్టా ఉంటాదా అని' అని సాయి పల్లవి చెప్పింది. ఇక ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి ఈ మూవీపై విమర్శలు మొదలయ్యాయి. 'శ్రీకాకుళం యాస ఇంత దరిద్రంగా ఉండదు. శ్రీకాకుళం యాస పాడు చేస్తున్నారు. ఈ సినిమా వల్ల శ్రీకాకుళంకి చెడ్డ పేరు రాకూడదు.. వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి' అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య గ్రామీణ నేపధ్యంలో అల్లిన ప్రేమ కధ ఇది.