టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు వరుణ్ తేజ్. కెరీర్ ప్రారంభం లో మంచి ప్రామిసింగ్ హీరోగా కనిపించారు. ముకుంద సినిమా ప్లాప్ అయినా కూడా లాభాలు వచ్చాయి. ఆ తర్వాత ఫిదా సినిమాతో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫ్ 2 - ఎఫ్ 3 సినిమాలు కూడా లాభాలు తెచ్చిపెట్టాయి. వరుణ్ తేజ్ సినిమా వస్తుంది అంటే ఒకప్పుడు బయ్యర్లు . . ఎగ్జిబిటర్లు ఎగబడి మరీ కొనేవారు. అలాంటి వరుణ్ తేజ్ ఇప్పుడు చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకే ఒక హిట్టు కోసం ఎదురుచూసే టాలీవుడ్ హీరోలలో వరుణ్ తేజ్ ముందు వరుసలో ఉన్నారు.
వరుణ్ తేజ్ ఇటీవల కాలంలో ఎక్కువగా డిజాస్టర్లు ఫేస్తూ వస్తున్నారు. అసలు నిజానికి చెప్పుకోవాలి అంటే.. 2019 లో వచ్చిన గద్దలకొండ గణేశ్ సినిమా తరువాత వరుణ్ తేజ్ కు సరైన సినిమా పడనేలేదు. ప్రతీ సినిమా ప్లాప్ అయ్యింది. ఈరకంగా చూసుకుంటే వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ చూసి దాదాపు 6 ఏళ్లు దాటి పోతుందనే చెప్పాలి. అసలు ఇటీవల కాలం లో వచ్చిన గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ , రీసెంట్ డిజాస్టర్ మట్కా. ఇలా వరుసగా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
అసలు వరుణ్ తేజ్ సినిమా వస్తుందంటే చాలు నిర్మాతల దగ్గర నుంచి బయ్యర్లు .. ఎగ్జిబిటర్లు అందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఇక ఈ జానర్ల లో సినిమాలు చేస్తుంటే లాభం లేదని తన జానర్ మార్చి హార్రర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు తో రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.