దివంగత సీనియర్ దర్శకుడు పి కృష్ణ తనయుడి గా తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు హీరో గోపీచంద్. కెరీర్ ప్రారంభంలో ముత్యాల సుబ్బయ్య లాంటి దర్శకుడు దర్శకత్వంలో తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత రూటు మార్చాడు ... విలన్ వేషాలు వేశాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా వర్షం సినిమాలో విలన్ గా నటించిన గోపిచంద్ ... మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలోని విలన్ గా నటించారు. విలన్ గా గోపీచంద్ కు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అయితే గోపీచంద్ తిరిగి హీరో అవతారం ఎత్తారు. వరుసగా యజ్ఞం - ఆంధ్రుడు - రణం లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో హీరోగా ట్రాక్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని కామెడీ సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి .అలాంటి గోపీచంద్ గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా. వరుస ప్లాపులతో .. వరుస డిజాస్టర్ లతో చాలా ఘోరమైన పరిస్థితికి వచ్చేశారు.
గోపీచంద్ నుంచి గత పది ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సరైన సాలిడ్ హిట్ సినిమా కూడా లేదు అంటే గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గోపీచంద్ నుంచి చివరగా వచ్చిన హిట్ సినిమా ఏదైనా ఉంది అంటే శ్రీవాస్ దర్శకత్వంలో 2015లో వచ్చిన లౌక్యం సినిమా అని మాత్రమే చెప్పాలి. సీనియర్ హీరోలలో ఒక్కటంటే ఒక్క హిట్ లేకుండా ఇబ్బందులు పడుతున్న హీరో గోపీచంద్. దాదాపు 10 ఏళ్లనుంచి సరైన సాలిడ్ సక్సెస్ కోసం సినిమాలు వరుస పెట్టి తీస్తూనే ... ఎదురు చూస్తూనే ఉన్నారు గోపీచంద్ . రిలీజైన సినిమాలన్నీ బిలో యావరేజ్ లేదా డిజాస్టర్ల టాక్ తో కంటిన్యూ అవుతున్నాయి. ఈ హీరో సాలిడ్ సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. ఈ సారైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్న గోపీచంద్ ఆశలు ఎప్పటకి నెరవేరతాయో ? చూడాలి.