- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు .. హీరోయిన్లు ప్రేమించుకుంటున్నారు ... పెళ్లి పీటలు ఎక్కుతున్నారు .. కొంతకాలం కాపురం చేసి విడాకులు తీసుకుంటున్న వారు కూడా ఉంటున్నారు. విచిత్రం ఏంటంటే 20 ఏళ్ళు కలిసి కాపురం చేసిన సినిమా సెలబ్రిటీలు ఆ తర్వాత కూడా విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు తమ ప్రియుళ్ల‌ను పరిచయం చేసి చాలాకాలం తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ - కాజల్ అగర్వాల్ - తాప్సి - ఇలియానా ఇలా చాలామంది హీరోయిన్ల పెళ్లిళ్లు జరిగిపోయాయి. అయితే గత కొంతకాలంగా నటుడు విజయవ్మ తో ప్రేమలో మునిగితేలుతున్న హీరోయిన్ తమన్నా మాత్రం ఇప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తటం లేదు. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ మాటకు వస్తే వీరి ప్రేమ తమన్నా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదన్న ప్రచారం కూడా జరిగింది. విజయవర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎంసీయే సినిమాలో విలన్ గా నటించారు. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు .. వెబ్ సిరీస్ లు చేస్తున్నారు.


విజయవర్మ - తమన్నా లస్ట్ స్టోరీస్ 2 చేస్తున్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడడంతో అదికాస్తా స్నేహంగా మరి .. ఆ తర్వాత ప్రేమగా మారిందని టాక్‌. రీసెంట్ టాక్స్ ప్రకారం వీరిద్ద‌రికి బ్రేక‌ప్ జ‌రిగింద‌ట‌. తమన్నా పెట్టిన ఒక పోస్ట్  అందరికి షాక్ ఇస్తోంది. లవ్ బ్రేకప్ ను సూచించే విధంగా  ప్రేమని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు.. అలాగే ఎదుటి వ్యక్తులకు సీక్రెట్ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఒకరు మిమ్మల్ని అందంగా చూడాలంటె, ముందు మీ చుట్టూ ఉన్నవాళ్లను అందంగా చూడడం నేర్చుకోవాల‌ని కామెంట్ చేసింది. దీంతో త‌మ‌న్నా ఫ్యాన్స్ కూడా ఆమె కు ఎంత క‌ష్టం వ‌చ్చిందో అని చ‌ర్చించుకుంటున్నారు. ఈ డైలాగ్ ను బ‌ట్టి చూస్తే ఆమెకు ప్రేమ‌లో ఏదో తెలియ‌ని బాధ కలిగింద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: