చందూ మొండేటి దర్శకత్వంలో, నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా 'తండేల్‌' మీద అక్కినేని అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో చిత్ర యూనిట్ ప్రసార కార్యక్రమాలు షురూ చేసింది. కాగా ఈ సినిమాలో నాగ చైతన్య ఫస్ట్ టైం ఒక జాలరి పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పాత్ర కోసం చైతూ దాదాపుగా 6 నెలలు హార్డ్ వర్క్ చేశారని వినికిడి. ఆ మేకోవర్ కోసం చైతన్య చాలా శ్రమించాడట. కొన్ని సన్నివేశాలను సముద్రం మధ్యలో చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా ఈ సినిమాకి చాలా ఎక్కువ సమయాన్ని దర్శకుడు తీసుకున్నాడని సమాచారం.

ఇక 'తండేల్‌' సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన ఎపిసోడ్‌ కోసం అదనంగా రూ.18 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు దర్శకుడు చందూ మొండేటి. ఆ సన్నివేశం సినిమాకే హైలెట్ గా నిలవనుందని వినికిడి. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా కథను రెడీ చేసినప్పటికీ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక సినిమాలోని పాకిస్తాన్‌ ఎపిసోడ్‌ గురించి మాట్లాడుతూ... సినిమాలోని ఆ కీలక సన్నివేశాలు 20 నిమిషాలు ఉండనున్నట్లు చెప్పుకొచ్చారు.

కాగా ఈ సినిమా హీరో నాగ చైతన్య సినిమా కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సినిమాలో మెయిన్‌గా హీరో హీరోయిన్‌ లవ్‌ స్టోరీ బాగా వర్కవుట్ అయ్యిందని వినికిడి. దర్శకుడు చందూ మొండేటి నాగ చైతన్య గురించి మాట్లాడుతూ... నాగార్జునకు అన్నమయ్య, చిరంజీవికి జగదేకవీరుడు.. ఎలాగో నాగచైతన్యకు తండేల్ ఆ విధంగా పేరు తీసుకు వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించడంతో తమిళ్‌లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోలీవుడ్‌లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో తండేల్‌ సినిమాకు మినిమం బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా విడుదల తర్వాత పాజిటివ్‌ టాక్‌ వస్తే తప్పకుండా భారీ వసూళ్లు సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: