అయితే కొన్ని కొన్ని సార్లు మనం టైం బాగో లేకపోయినా కారణంగా కావచ్చు..శని నెత్తి మీద తాండవం చేస్తున్న కారణంగా కావచ్చు ..రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ లైఫ్ లో కోలుకోలేని దెబ్బ తింటూ ఉంటాము . అయితే పవర్ స్టార్ లాంటి హీరో పవన్ కళ్యాణ్ కూడా అలా రాంగ్ స్టెప్ వేసి సోషల్ మీడియాలో ఇప్పటికి ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నాడు . పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడిన సరే అందరూ ముందుగా మంచితనానికి మరో మారుపేరని గుర్తు చేసుకుంటూ ఉంటారు . అయితే పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ పట్టే ఒకే ఒక పాయింట్ మూడు పెళ్లిళ్లు.
ఆయన లైఫ్ లో ఈ మూడు పెళ్లిళ్లు తప్పిస్తే మరి మిగతా నెగిటివ్ పాయింట్ ఏ లేదు . ఆ కారణంగానే ఆయనను తిట్టాలి అనుకున్నా ఆయనను బ్లెమ్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు మూడు పెళ్లిళ్లు మేటర్ ని లేవదీస్తూ ఉంటారు. పొలిటికల్ పరంగా కూడా మూడు పెళ్ళిల మేటర్ ని ఎంత హైలెట్ చేశారో.. ఎలక్షన్ టైం లో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ముందు నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ తో కొంతకాలం డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు . అయితే ఆమెకి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు అన్నాలెజినోవాను పెళ్లి చేసుకొని ముందుకు వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో తెలిసి తెలియక తీసుకున్న ఈ డెసిషన్ కారణంగానే ఇప్పటికి సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటాడు అంటూ పలువురు జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . చందమామకు కూడా చిన్న మచ్చున్నట్లు పవన్ కళ్యాణ్ కి మూడు పెళ్లిళ్లు అనేది ఒక మచ్చలా మిగిలిపోయింది..!