ఈ సినిమాతో మొదలైన సినీ జీవితం సాక్షి రంగారావు చివరి శ్వాస వరకు ఆయన నటుడు గానే ఉన్నారు. ఆయన సినీ జీవితంలో సుమారు 450 సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రలో నటించి మెప్పించారు .. చివర వరకు నటిస్తూనే స్టేజి మీద కుప్పకూలి ప్రాణాలు వదిలేశారు .. తన జీవితమంతా నటనకే అంకితం చేసిన గొప్ప మనిషి. ప్రకాశం జిల్లాలో సాక్షి రంగారావు పుట్టారు .. ఈయన తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో బంధువుల దగ్గర మచిలీపట్నంలోని పామరులో పెరిగారు .. అలాగే వైజాగ్ లో చదువు పూర్తయ్యాక యాక్టింగ్ లో డిప్లమో పూర్తి చేశారు .. ఆ తర్వాత పలు స్టేజి నాటకాల్లో కూడా పనిచేశారు .. ఇలా నాటకాల్లో నటిస్తూనే మద్రాసు వెళ్లి దర్శకులు బాబు రామణలను కలపటం వారు తెరకెక్కించిన సాక్షి సినిమాలో అవకాశం రావడం అన్ని చకచకా జరిగిపోయాయి ..
ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు రావడంతో ఆయన మద్రాసులోనే సెటిలైపోయారు .. ఆయనకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా ఉన్నారు .. వారిలో సాక్షి శివా పలు తెలుగు సీరియల్స్ లో ఇప్పటికీ నటిస్తున్నారు. అంతేకాకుండా సాక్షి రంగారావు కి గాడమైన చివర కోరిక కూడా ఉంది .. కన్యాశులకం ఏడు గంటల పాటు నడిచే ఈ నాటకంలో నటించాలని సాక్షి రంగారావు అనుకున్నారు .. మరో వారం రోజుల్లో ప్రదర్శన అనగా ఉన్నట్టుండి స్టేజిపైనే కుప్పకూలిపోయారు .. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకువెళ్లగ కొద్ది రోజుల్లో ట్రీట్మెంట్ కు సహకరించిన ఆయన తర్వాత అనారోగ్య సమస్యలతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇలా తన చివరి కోరిక తీరకుండానే సాక్షి రంగారావు మరణించారు.