టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ కి ఒకప్పుడు తిరుగులేని క్రేజ్ తో పాటు మార్కెట్ ఉండేది. అయితే కాల క్రమంలో నాగార్జున తర్వాత ఆయన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అసలు నాగార్జునకే గత కొన్నేళ్లు గా సరైన హిట్లు లేవు. ఇక అఖిల్ గురించి మాట్లాడు కోవడం టైం వేస్ట్ అన్నట్టుగా ఉంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మినహా అఖిల్ కు ఒక్క హిట్టూ లేదు. చేసినవి అన్ని అరివీర భయంకరమైన డిజాస్టర్లు. ఆ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా కూడా చెప్పుకోదగ్గ హిట్ కానే కాదు. చివరకు ఏజెంట్ సినిమాకు తన రెమ్యునరేషన్ సైతం త్యాగం చేసి సినిమా లో నటించినా కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అఖిల్ సినిమా తర్వాత మరోసారి ఏజెంట్ సినిమాతో అఖిల్ పరువు మొత్తం గంగలో కలిసింది.
నాగార్జునతో పాటు ఆయన వారసులు అయిన అక్కినేని అన్నాదమ్ములలది కూడా ఇదే పరిస్థితి. నాగచైతన్య కూడా ఏదో యావరేజ్ టాక్ తో నడింపించేస్తున్నాడు కానీ ..ఇప్పటి వరకూ కెరీర్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భం లేదు. మజిలీ తర్వాత అన్నీ ఫ్లాపులే వచ్చాయి. మధ్యలో లవ్ స్టోరీతో మంచి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు తండేల్ తో అద్భుతం చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే చైతు కెరీర్ కొన్నాళ్లు ఉంటుంది. ఇక తమ్ముడు అఖిల్ పరిస్థితి అయితే మరీ ధారుణం. హీరోగా తన ఇమేజ్ ను ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయాడు .. కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి హిట్ ఒక్కటీ పడలేదు. ఏదేమైనా అక్కినేని ఫ్యామిలీ పరువు నిలబడాలి అంటే తండేల్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి.. లేకపోతే ఇప్పటికే పోయిన పరువు ఇంకాస్త దిగ జారుతుంది.