ప్రస్తుతం సౌత్ సినిమాల్లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు జవాబుగా వినిపిస్తోంది. కొన్ని నెలల క్రితం వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి పీటలెక్కి వివాహ బంధంలోకి వెళ్లారు. అయితే తాను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదంటూ వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి తన ఫ్రెండ్ అయిన నికోలయ్ సచ్ దేవ్ ను పెళ్లి చేసుకున్నారు.
 
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పెళ్లి తర్వాత నా లైఫ్ ఏం మారలేదని కామెంట్లు చేశారు. పెళ్లి తర్వాత నా లైఫ్ ఏం మారలేదని నాకంటే నా భర్త జీవితం ఎక్కువగా మారిందని వరలక్ష్మి పేర్కొన్నారు. నా భర్త నాకోసం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారని వరలక్ష్మి వెల్లడించారు. నా భర్త తన పేరును నికోలయ్ సచ్ దేవ్ వరలక్ష్మీ శరత్ కుమార్ గా మార్చుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
 
కెరీర్ పరంగా నేను ఎన్నో సాధించాలని నా భర్త ఆశిస్తున్నారని ఆమె చెప్పుకొఛారు. వర్క్ విషయంలో నా భర్త నాలో స్పూర్తి నింపుతున్నారని ఆమె తెలిపారు. పెళ్లి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదని అసలు చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు ఉండేది కాదని ఆమె వెల్లడించడం గమనార్హం. వరలక్ష్మీ శరత్ కుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
వరలక్ష్మీ శరత్ కుమార్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మాత్రం మామూలుగా లేవు. వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన మదగద రాజ మూవీ ఈరోజే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైంది. సినిమా సినిమాకు వరలక్ష్మీ శరత్ కుమార్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. వరలక్ష్మి తెలుగులో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: