అయితే, ప్రభాస్ ప్రూవ్ చేసుకోవడానికి వర్షం అనే సినిమా పడాల్సి వచ్చింది. ఇక దాని తరువాత వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఇకపోతే మొదటి నుంచి ప్రభాస్ కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. కానీ డార్లింగ్ డాన్సు చేయడంలో చాలా వీక్ మరి. ఆరడుగుల ఎత్తు కావడంతో హెవీ డ్యాన్స్ మూమెంట్స్ చేయలేకపోయాడు. ఆ సమయంలోనే ప్రాక్టీస్ కోసం కొన్ని రోజులు కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడట డార్లింగ్ ప్రభాస్. కాగా ఆయన డ్యాన్స్ నేర్చుకుంటున్న ఒక రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా రెబల్స్ ఆ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడంటే కొరియోగ్రాఫర్ అనగానే.. శేఖర్, జానీ మాస్టర్ పేర్లు వినబడుతున్నాయి కానీ, అప్పట్లో రాకేష్ మాస్టర్ కు కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు ఉండేది. అతని దగ్గరే శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ ను శేఖర్ మాస్టర్ తొక్కేశాడనే పుకార్లు బాగా ఆమధ్య వినిపించేవి. ఒకసారి రాకేష్ మాస్టర్ బాహాటంగానే ఈ విషయాలు చెప్పుకొచ్చాడు. అయితే ఈ పుకార్లపై సరియైన ఆధారాలు అంటూ ఏవీ లేవు. ఆట అనే డ్యాన్స్ షో లో డ్యాన్సర్ గా రాకేష్ మాస్టర్ కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత ఎన్నో హిట్ సాంగ్స్ కు ఆయన కొరియోగ్రఫీ అందించాడు. శేఖర్ మాస్టర్.. రాకేష్ మాస్టర్ గురించి తక్కువ చేసి మాట్లాడి, వచ్చిన అవకాశాలను అతను లాక్కొనేవాడని టాక్. ఆ తరువాత అవకాశాలు లేక మద్యానికి బానిసగా మారి.. నోటికి వచ్చింది మాట్లాడి విమర్శలు పాలయ్యాడు రాకేష్ మాస్టర్.