తన ఇన్‌స్టాస్టోరీలో ఆమె త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ... ‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి!' అని రాసుకొచ్చారు. దాంతో పూనమ్ పాండే షేర్ చేసిన ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'నా సకల పాపాలు కొట్టుకుపోయాయి. జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన ఫీలింగ్ కలుగుతోంది. ఇక్కడ 70 ఏళ్ల వృద్ధులు కూడా కళ్ళకి చెప్పులేకుండా గంటల తరబడి నడుస్తారు. ఇక్కడ విశ్వాసానికి హద్దులు లేవు. కుంభమేళాలో తమ ప్రాణాలు కోల్పోయిన వారికి సైతం మోక్షం దొరుకుతుందని ఆశిస్తున్నా! ఇక్కడి భక్తి చూస్తే, నాకు నోట నుండి మాటలు రావడం లేదు.' అని పూనమ్ పాండే తన్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.
ఇకపోతే 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళాలో బుధవారం నాటికే 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. సుమారు 40 కోట్ల మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారని అధికారులు అంచనా. దురదృష్టకరం ఏమిటంటే... ఈ మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలిరావడంతో సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.