
గత సంవత్సరం కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్-2’ చిత్రంలో కీలక పాత్రలో సిద్ధార్ధ్ నటించగా ఆ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం అయితే సిద్ధార్థ్ ‘ఇండియన్-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్ధ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘స్త్రీ నడుముపై దరువులు వేయడం.. స్త్రీకి ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడికి వెళ్లకూడదో చెప్పే స్క్రిప్టులు నా దగ్గరకు చాలానే వచ్చాయి. అలాంటి స్క్రిప్టులను నేను రిజెక్ట్ చేశాను. నేనే గనక అలాంటి సినిమాలు చేసి ఉంటే ఈపాటికి పెద్ద స్టార్ హీరోను అయ్యేవాడని. కానీ నేను ఆడవాళ్లతో గౌరవంగా నడుచుకుంటాను. 15 ఏళ్ల క్రితం నా సినిమాలను కూడా పిల్లలు ఇప్పటికీ ఎంతో ఇష్టంగా చూస్తారు. అలాంటి సినిమాలు చేయనందుకు నాకు గర్వంగా ఉంటుంది!" అని పేర్కొన్నారు.
దాంతో ఈ వ్యాఖ్యలు ఇపుడు నెట్టింట సెన్సేషనల్‌గా మారాయి. ఎందుకంటే ఈమధ్య ఎక్కువగా అడల్ట్ కంటెంట్ మీద ఎక్కువగా మన తెలుగులోనే సూపర్ డూపర్ హిట్లు సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ చేసిన అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు అదే కోవకు చెందినవిగా అనిపిస్తాయి. ఆ కారణంగానే సందీప్ అభిమానులు హీరో సిద్ధార్ధ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సిద్ధార్ధ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. సిద్ధార్థ్, అతిదిరావు హైదరీ ఈమధ్య ప్రేమించుకుని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి విదితమే.