వెంకటేష్ పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి తెరకెక్కించారు ఈ సినిమాకి నిర్మాతలు మొత్తం 60 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయగా.. పండుగ సీజన్ కావడంతో ఈ సినిమా విడుదలకు ముందు 50 కోట్లకు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.. జనవరి 14న ఈ సినిమా విడుదలై భారీ విజయంతో దూసుకుపోయింది. విడుదల ఇప్పటికి 18 రోజులు పైనే అవుతూ ఉన్న హౌస్ ఫుల్ బోర్డుతోనే కనిపిస్తోంది. 15 రోజులకే 275 కోట్లను కలెక్ట్ చేసిందట.
దీంతో ఈ సినిమాని కొన్న వారందరికీ కూడా మంచి లాభాలు రావడంతో వారందరూ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట.. ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు చిత్ర యూనిట్కు మంచి పార్టీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగు సినీ చరిత్రలోనే ఒక సరికొత్త చరిత్రగా మిగిలిపోయా అవకాశం ఉంది సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే ఇటీవలే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాలు సైతం సరైన సక్సెస్ను అందుకోలేదు ముఖ్యంగా బయ్యర్లకు కూడా ఎలాంటి లాభాలు రాని పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టి చరిత్రను సృష్టిస్తోంది.