మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు..ఆయన నటించిన చాలా సినిమాలు ఊహించని కలెక్షన్స్ సాధించాయి.. కానీ ప్రస్తుతం మెగాస్టార్ ఓ భారీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. గతంలో  తాను నటించిన “భోళాశంకర్ “ సినిమా మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది..అందుకే ఈ సారి భారీ హిట్ అందుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.. ప్రస్తుతం మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో భారీ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మూవీని యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది..ఈ సినిమా ప్రారంభానికి ముందు చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబందించి ఓ కాన్సెప్ట్ వీడియో రిలీజ్  చేసింది.. అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. అయితే ఇటీవల ఈ చిత్రం నుండి మేకర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్రాఫిక్స్ వర్క్ పై ప్రేక్షకులలో మిక్స్డ్ టాక్ వచ్చింది.. దీనితో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్రాఫిక్స్ విషయంలో చిత్ర కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.


 ‘విశ్వంభర’ సినిమాను మేకర్స్ మే ‘9’ న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు..గతంలో అదే తేదికి మెగాస్టార్ కెరీర్ లో నే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “ జగదేకవీరుడు అతిలోక సుందరిసినిమా రిలీజ్ కావడంతో ఆ తేదీనే “విశ్వంభర“ రిలీజ్ చేయాలనీ చూస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే స్టార్ బ్యూటీ త్రిష ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది..ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ సాలిడ్ లైనప్ సిద్ధం చేసుకున్నారు. ఊహించని విధంగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్సినిమా అనౌన్స్ చేశారు.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ని తీసుకోనున్నారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది.


ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అనిరుధ్ పేరు దాదాపు లాక్ అయ్యినట్టుగా తెలుస్తోంది.ఇటీవల తెలుగులో దేవర సినిమాతో అనిరుధ్ అదరగొట్టాడు. ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజిఎం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. దీనితో మెగాస్టార్ అనిరుధ్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: