విక్రం - ఖైదీ తరహలో స్టయిలీష్ యాక్షన్ విజువల్స్, మాస్ ఎలిమెంట్స్ కొత్త అనుభూతిని పంచాయి. బేసిక్ గా బాలయ్య అంటే వీరమాస్ గా .. ఊరమాస్ గా చూపించడానికి మొగ్గు చూపుతారు దర్శకులు. కానీ బాబీ మాత్రం బాలయ్యని స్టయిలీష్ గా ప్రజెంట్ చేయడం ఆయన అభిమానులు కూడా పిచ్చ పిచ్చగా నచ్చింది. సినిమా పైసా వసూల్ వినోదాన్ని అందించి బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
ఇక బాక్సాఫీసు పరంగా సంక్రాంతి విన్నర్ గా విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. దిల్ రాజు కి గేమ్ ఛేంజర్ నష్టాలు అన్నీ ఈ సినిమా తో భర్తీ అయిపోయాయి. సినిమా రిలీజ్ కు ముందే పాటలు జనాల్లోకి వెళ్ళడం, ఫ్యామిలీ ఎలిమెంట్స్, సంక్రాంతి సీజన్.. ఇవన్నీ ఈ సినిమాకి కలిసొచ్చాయి. ఏదేమైనా టాలీవుడ్‌లో జనవరి మంచి ఊపు ఇచ్చింది. ఇదే ఊపు ఈ యేడాది పెద్ద సినిమాలు కూడా హిట్ అయ్యి కొనసాగిస్తే 2025 టాలీవుడ్‌లో సెన్షేషన్ అవుతుందనడంలో సందేహం లేదు.