నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలయ్య కొంత కాలం క్రితం వరుస అపజయాలను ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా బాలయ్య , బాబి కొల్లి దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే వరుసగా బాలయ్య దర్శకులకు హిందీ సినిమా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది .

ఇప్పటికే బాలయ్యతో వీర సింహా రెడ్డి మూవీ ని తెరకెక్కించిన గోపీచంద్ మలినేని హిందీ నటుడు అయినటువంటి సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ మరి కొంత కాలంలోనే విడుదల కానుంది. ఇక తాజాగా బాలయ్య తో డాకు మహారాజు సినిమాను రూపొందించిన బాబీ కి కూడా హిందీ సినీ పరిశ్రమ నుండి వరుసగా అవకాశాలు వస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి బాబి కూడా తన నెక్స్ట్ మూవీ గా హిందీ సినిమాను రూపొందిస్తాడా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: