అయితే రష్మిక, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ వేడుక ముంబాయిలో జరిగింది. కాలికి గాయం అయినప్పటికీ ఆ ఈవెంట్ కి రష్మిక వచ్చింది. ఈ సినిమాలోని 'జానే తూ..' అనే గీతాన్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. రష్మిక ఈ కార్యక్రమానికి వీల్ ఛైర్ లో హాజరైంది. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఛావా సినిమాలో మహారాణి ఏసుబాయి పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా సన్నద్దమయ్యానని చెప్పుకొచ్చింది. ఆ పాత్ర సంభాషణలు పలికే తీరు.. ఆ యాసను పట్టుకునేందుకు నెలల తరబడి శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు.. అలాగే ఈ సినిమా చూసిన ప్రతిసారీ తాను కంటతడి పెట్టుకున్నట్లు రష్మిక చెప్పింది.
ఇక రష్మిక మందన్న 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమమైంది. ఈమెను అక్టోబరు 2024లో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.