టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకొని ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న బ్యూటీలలో రష్మిక మందన ఒకరు. ఈ నటి తన కెరియర్లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఇకపోతే చాలా సినిమాలను ఈ బ్యూటీ రిజెక్ట్ కూడా చేసింది. ఇకపోతే ఈమె రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను కూడా అందుకున్నాయి. మరి రష్మిక వదిలేసిన ఆ ఫ్లాప్ మూవీలు ఏవో తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ఆయనకు జోడిగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించింది. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే ను కాకుండా రష్మికను తీసుకోవాలి అని మేకర్స్ అనుకున్నారట. అందులో భాగంగా ఆమెను సంప్రదించగా ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. దానితో రష్మికను ఈ సినిమాలో చరణ్ కి జోడిగా తీసుకున్నారట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే కొంత కాలం క్రితం తమిళ నటుడు తలపతి విజయ్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో విజయ్ కి జోడిగా మొదట పూజా హెగ్డేను కాకుండా రష్మికను తీసుకోవాలి అని ఈ మూవీ మేకర్స్ అనుకున్నారట. అందులో భాగంగా ఆమెను సంప్రదించగా ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇక ఈ మూవీలో పూజా హెగ్డేను ఆ తర్వాత హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారట. ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా రష్మిక రిజెక్ట్ చేసిన ఆచార్య , బీస్ట్ మూవీలు ఫ్లాప్ కావడంతో రష్మిక డెసిషన్ అద్భుతం అని అందుకే ఆమె స్టార్ హీరోయిన్ అయింది అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తపరిస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: