టాప్ డైరెక్టర్ గా నిన్న మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ వరస ఫ్లాప్ లతో సతమతమౌతు ఉండటంతో అతడితో సినిమాలు చేయడానికి టాప్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల వరకు పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు. విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’ మూవీ ఫ్లాప్ కావడంతో తన శక్తిని అంతా కూడగట్టి రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ తీశాడు.


అయితే ఈమూవీ కూడ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో పూరీజగన్నాథ్ మరింత నిరాశలోకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం నాగార్జునతో అతడు ఒక సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆప్రయత్నాలు పెద్దగా ముందుకు నడవడంలేదు అన్న గాసిప్ లు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ధియేటర్లలో ఫ్లాప్ అయిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ ఓటీటీ లో క్రియేట్ చేస్తున్న సంచలనాలు షాకింగ్ గా మారాయి.


గత నెలరోజుల క్రితం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చాల తక్కువ టైంలో 100 మిలియన్ వ్యూస్ అందుకోవడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈమూవీ ఫస్ట్ పార్ట్ ‘ఇస్మార్ట్ శంకర్’ నాలుగు సంవత్సరాల క్రితం విడుదలైన తరువాత ఈమూవీని అప్పట్లో ఓటీటీ లోకి పెట్టినప్పుడు ఇప్పటి వరకు 386 మిలియన్ వ్యూస్ వచ్చాయి అని తెలుస్తోంది. అయితే ఫ్లాప్ అయిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఇంత తక్కువ కాలంలో ఇంత వేగంగా వ్యూస్ తెచ్చుకోవడంతో ఈసంవత్సరాంతానికి 500 వ్యూస్ మిలియన్ల దాటినా ఆశ్చర్యయంలేదు అని అంటున్నారు.


ఇలాంటి రికార్డు ఈ సినిమాకు ఓటీటీలో రావడానికి ఒక కారణం ఉంది అని తెలుస్తోంది. ఉత్తరాది ప్రేక్షకులు మాస్ సినిమాలను విపరీతంగా ఇష్టపడతారు. ఈకారణం వల్లే ‘పుష్ప 2’ కలక్షన్స్ మన తెలుగు రాష్ట్రాలలో కంటే ఉత్తరాదిలో రికార్డు స్థాయిలో వచ్చాయి. హీరో రామ్ కు అదేవిధంగా బెల్లంకొండ శ్రీనివాస్ కు ఉత్తరాది ప్రేక్షకులలో మాస్  హీరోలుగా మంచిపేరు ఉంది.  అందుకే వారు నటించిన సినిమాలు ఫెయిల్ అయినా ఓటీటీలో ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: