నితిన్ తో నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. ఈమూవీ విడుదల గురించి ఆమె చాల ఆశక్తిగా ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఆమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఆమెకు ఊహించని ఆఫర్ వచ్చింది. ‘ఆకాశం నీ హద్దురా’ మూవీతో క్రియేటివ్ దర్శకురాలిగా పేరు గాంచిన సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ఒక వింటేజ్ డ్రామా మూవీలో శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తోంది.
రవి మోహన్ అధర్వ కీలక పాత్రలలో నటించిన ఈమూవీ త్వరలో విడుదల కాబోతోంది. అయితే ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. 1965 ప్రాంతంలో తమిళనాడులో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈమూవీని తీస్తున్నారు. ఈమూవీ కథ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో అంటరానితనం అగ్ర కులాల అహంకారం ప్రభుత్వాల పక్షపాతం హిందీ వ్యతిరేక ఉద్యమం ఇలా చాలా వివాదాస్పద విషయాల చుట్టూ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి ఈసినిమాను సూర్య దుల్కర్ సల్మాన్ ఫహద్ ఫాసిల్ కాంబినేషన్ లో తీయాలని మొదట్లో భావించారు. అయితే అది కుదరక పోవడంతో ఇప్పుడు శివ కార్తికేయన్ తో తీస్తున్నారు. మొదట్లో శ్రీలీల చేస్తున్న పాత్ర నజ్రియా కు ఇచ్చారు. అయితే ఆమె స్థానంలో ఇప్పుడు శ్రీలీల వచ్చి చేరడంతో ఈపాత్ర ఆమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కథ ఏమిటి అన్నది ఎక్కువ రివీల్ కాకుండా విడుదల చేసిన టీజర్ మంచి ఆశక్తిని పెంచింది..