టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అత్యంత వేగంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో కృతి శెట్టి ఒకరు. ఈ నటి ఉప్పెన అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉప్పెన సినిమా విడుదల కాకముందే ఆ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన పాటలు , ప్రచార చిత్రాల ద్వారానే కృతి శెట్టి కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. దానితో ఉప్పెన సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరుగుతుంది అని అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేశారు. ఇక ఉప్పెన సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో కృతి శెట్టి కూడా తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చింది. ఇక ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. ఉప్పెన మూవీ తర్వాత ఈ నటి నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దానితో ఈమె స్టార్ హీరోయిన్ స్టేటస్ను చాలా తక్కువ కాలంలో అందుకుంటుంది అని అభిప్రాయాలను చాలా మంది వ్యక్త పరిచారు. కానీ ఈ బ్యూటీ కి బంగార్రాజు సినిమా తర్వాత నుండి వరుస పెట్టి అపజయాలు వచ్చాయి. దానితో ఈమె కెరియర్ మెల్లి మెల్లిగా పడిపోతూ వచ్చింది.

ఇక ఈ బ్యూటీ కి ప్రస్తుతం తెలుగులో భారీ క్రేజ్ ఉన్న సినిమా ఆఫర్లు కూడా ఏమీ లేవు. దానితో చాలా మంది కృతి శెట్టి కి అద్భుతమైన క్రేజ్ మొదటి మూడు మూవీల ద్వారా వచ్చింది. కానీ ఈ ముద్దుగుమ్మ వచ్చిన ప్రతి సినిమాను చేయడం ద్వారా ఈమెకు అపజయాలు వచ్చాయి. అందుకే ఈమె క్రేజ్ చాలా వరకు పడిపోయింది. మళ్ళీ అవకాశాలు వచ్చిన ప్రతి సినిమాను ఓకే చేయకుండా హిట్ అయ్యే అవకాశాలు ఉన్న సినిమాలను చేస్తే మళ్లీ ఈమె కెరియర్ పంచుకుంటుంది అనే అభిప్రాయాలను కొంతమంది వ్యక్తపరుస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: