చాలామందికి కొన్ని కొన్ని కోరికలు అలాగే తీరకుండా ఉండిపోతాయి . పెద్ద బడా స్టార్ సెలబ్రిటీ అయిన.. వేలకోట్ల ఆస్తికి వారసులైన .. కొన్ని కొన్ని చిన్న చిన్న సరదాలు మనం కోరుకున్నవి అవి జరగకపోవచ్చు.  నందమూరి బాలయ్య లైఫ్ లో కూడా అలాగే జరిగింది . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ  వైరల్ గా మారింది. రీసెంట్ గా "డాకు మహారాజ్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య .


సినిమా ఆయనకు మంచి పాజిటివ్ కామెంట్స్ దక్కేలా చేసింది . కాగా ప్రెసెంట్ అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు బాలయ్య. మరొక పక్క మోక్షజ్ఞ సినిమా కోసం కూడా పక్కా ప్రణాళికను ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాడు . అయితే ఇలాంటి మూమెంట్లోనే బాలయ్యకు సంబంధించిన లైఫ్ విషయం బయటపడింది . బాలయ్య అనుకుంటే ఎలాంటి పనైనా చేసేస్తాడు . అది అందరికీ తెలిసిందే.  అలాంటి బాలయ్యకు లైఫ్ లో తీరని కోరిక ఏముంది అనేగా పెద్ద డౌట్ .


బాలయ్యకు మనవరాలిని ఎత్తుకోవాలని ఎప్పటినుంచో ఆశగా ఉండిందట. బాలయ్య ఇద్దరి కూతురులకి కొడుకులే . అయితే ఆయనకి ఇంట్లోకి మహాలక్ష్మి ఉండాలి అని ..పట్టు పరికిణిలో మహాలక్ష్మి ల ఇంట్లో తిరగాలి అని చాలా ఆశగా ఉండిందట . అయితే బాలయ్య కోరిక ఇప్పటికీ నెరవేరలేదు.  అది ఎప్పటికి నెరవేరుతుంది అంటూ వెయిట్ చేస్తున్నారు . అయితే బాలయ్య ఇద్దరి కూతుర్లు ఎప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు . నాన్నలాగే నీతి నిజాయితీగా వర్క్ చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు . మరి ముఖ్యంగా బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి ఎప్పుడు కూడా జనాలను సెపరేట్గా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది.  ఆమె మాట్లాడే మాటలు ఆమె వేసే అడుగులు అందరికీ బాగా నచ్చుతాయి.  రీసెంట్ గా ఆయన చిన్న కూతురు సైతం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్ళిపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: