బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అంటే ఇండియా వైడ్ గా అభిమానులు ఉన్న హీరో.. ఈ హీరో కేవలం బాలీవుడ్ కి మాత్రమే కాకుండా సౌత్ లో కూడా సుపరిచితులు.. అయితే అలాంటి ఈ హీరో సినిమాల కంటే ఎక్కువగా తన రిలేషన్స్ ద్వారానే వైరల్ గా మారారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.. మరి ఇంతకీ అమీర్ ఖాన్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా..ఆయన మూడో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. అమీర్ ఖాన్ కి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట రీనా దత్తాని పెళ్లి చేసుకున్న ఈయన పిల్లలు పుట్టాక విడాకులు ఇచ్చి కిరణ్ రావుని పెళ్లాడారు. కిరణ్ రావు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ ఆమెకి కూడా విడాకులు ఇచ్చేశారు. అయితే వీరిద్దరి విడాకులు జరిగిన సమయంలో దంగల్ మూవీలో అమీర్ ఖాన్ కూతురు పాత్రలో నటించిన ఫాతిమా షేక్ పేరు వినిపించింది. 

ఫాతిమాతో అమీర్ ఖాన్ ఎఫైర్ పెట్టుకోవడం వల్లే రెండో భార్యకు విడాకులు ఇచ్చారనే రూమర్లు బీటౌన్ లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రూమర్లు వినిపించడానికి కారణం అమీర్ ఖాన్ ఫాతిమా ఇద్దరూ కలిసి క్లోజ్ గా తిరుగుతూ మీడియా కంట పడడంతో ఇది నిజమే అని అందరూ అనుకున్నారు.అయితే ఈ వార్తలు కొద్ది రోజులుగా ఆగిపోయాయి. అయితే తాజాగా 60 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్న అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు బీటౌన్ లో ప్రచారం జరుగుతుంది.. గత కొద్దిరోజుల నుండి అమీర్ ఖాన్ బెంగళూరుకు చెందిన అమ్మాయితో తిరుగుతున్నాడని,త్వరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.. అయితే ప్రముఖ ఫిలింఫేర్ కథనంలో అమీర్ ఖాన్ కి సంబంధించిన మూడో పెళ్లి రూమర్ ని రాసుకోచ్చారు.

అందులో ఏం రాశారంటే.. అమీర్ ఖాన్ చాలా రోజుల నుండి బెంగళూరుకు చెందిన అమ్మాయితో తిరుగుతున్నాడు. వీరిద్దరి మధ్య డేటింగ్ కూడా కన్ఫర్మ్ అయిందని, రీసెంట్ గానే తన ఫ్యామిలీకి ఆ అమ్మాయిని పరిచయం చేశాడని,వీరి మధ్య రిలేషన్ ని మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఓకే చేసారని, వీరిద్దరి ప్రేమకి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నట్టు వార్తలు రాసారు. దీంతో అమీర్ ఖాన్ మూడో పెళ్లి వార్తలు బీటౌన్ లో గుప్పుమన్నాయి.మరి నిజంగానే అమీర్ ఖాన్ 3 పెళ్లి చేసుకోబోతున్నారా అనేది హీరో క్లారిటీ ఇస్తే గానీ తెలియదు.. ఇక అమీర్ ఖాన్ ప్రస్తుతం తారే జమీన్ పార్ అనే మూవీకి సీక్వెల్ గా సితారే జమీన్ పార్ లో నటిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: