టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్. ఇకపోతే వెంకటేష్ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సైంధవ్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరచింది. ఇది ఇలా ఉంటే తాజాగా వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటికీ ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ ఈజీగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు వసూలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: