సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోలు తమ దగ్గరకు ఒక కథ వచ్చిన సందర్భంలో ఆ కథ మొత్తం విన్నాక ఆ కథతో సినిమాను రూపొందిస్తే అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని తెలిసిన కూడా తమ ఇమేజ్ కారణంగా సినిమా కథలను వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన దగ్గరకు ఒక కథ వచ్చినప్పుడు అది మొత్తం విన్నాక సినిమా కథ సూపర్ గా ఉంది. బ్లాక్ బస్టర్ అయ్యే లక్షణాలు కథలో పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆ సినిమా తనపై అస్సలు వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఆ మూవీ కథను రిజెక్ట్ చేశాడట. ఆ విషయాన్ని స్వయంగా తారక్ ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. అసలు ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ , జెనీలియా జంటగా భాస్కర్ "బొమ్మరిల్లు" అనే సినిమాను రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ ని మొదట భాస్కర్ , సిద్ధార్థ్ తో కాకుండా తారక్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనను కలసి కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న తారక్ సినిమా స్టోరీ సూపర్ గా ఉంది. కానీ నా సినిమాకు వచ్చే జనాలు ఎక్కువ శాతం యాక్షన్ సన్నివేశాలు , భారీ డైలాగ్స్ , మాస్ అంశాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటివి అన్ని ఆశించి థియేటర్ కి వచ్చిన జనాలకు అవి ఏవి లేనట్లయితే డిసప్పాయింట్ అవుతారు. సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కథ సూపర్ గా ఉన్నా కూడా ఈ కథ నాపై వర్కౌట్ కాదు అని చెప్పినట్లు తారక్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. తారక్ రిజెక్ట్ చేసిన తర్వాత బొమ్మరిల్లు కథను భాస్కర్ , సిద్ధార్థ్ హీరోగా రూపొందించగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: