అక్కినేని అన్న పేరు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ వస్తుంది . మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున తన కొడుకులు లైఫ్ ని పూర్తిగా వదిలేశాడు అని .. అసలు ఆయన సినిమాల పరంగా అదేవిధంగా వల్ల పర్సనల్ లైఫ్ పరంగా కొడుకులను అస్సలు పట్టించుకోవట్లేదు అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు . అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది . ఇద్దరు కొడుకులు సినిమాలో మంచి మంచి పొజిషన్ కి వెళ్లే రేంజ్ లోనే మూవీ ని సెట్  చేసుకున్నారు . అంతేనా లైఫ్ లో కూడా సెటిలైపోయారు.  నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు . అక్కినేని అఖిల్ జైనబ్ రవ్జీ ను మార్చి నెలలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు .


కెరియర్ పరంగా పక్కనపడితే పర్సనల్ లైఫ్ పరంగా ఇద్దరు సెటిల్ అయిపోయారు . "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నాగచైతన్య . అఖిల్ కూడా ఓ బడా డైరెక్టర్ తో ఛాన్స్ కొట్టేసాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . కాగా ఇదే మూమెంట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అక్కినేని నాగార్జున చిన్న కోడలు జైనబ్ రవ్జీ కి ఒకే ఒక కండిషన్ పెట్టారట . కేవలం ఆమెకే కాదు ఇప్పటివరకు ఇంటికి కోడలుగా వచ్చిన సమంతకి.. ఇంటికి కోడలుగా రావాలి అనుకున్న శ్రేయ భూపాల్ కి అదే విధంగా శోభిత ధూళిపాళ్లకు కూడా అదే కండిషన్ పెట్టారట .



నాగచైతన్యకి చిన్న పిల్లలు అంటే చాలా చాలా ఇష్టమట . మరీ ముఖ్యంగా ఆడపిల్లలు అంటే ఇంకా ఇష్టమట.  తనకి ఒక మనవరాలు పుట్టాలి అని ఎప్పటినుంచి ఆశపడుతూ వచ్చారట . శోభిత ధూళిపాళ్ళ  కంటే ముందే నాగచైతన్య - సమంతల పెళ్లి జరిగింది.  వాళ్ల పెళ్లి జరిగిన రోజు అలాగే ఆయన ఆశీర్వదించారట . "వన్ ఇయర్ లో మాకు ఒక బుల్లి మహాలక్ష్మి ఇవ్వాలి" అంటూ కోరుకున్నారట . అయితే అది జరగలేదు. శ్రేయ భూపాల్ నిశ్చితార్ధం టైంలో అదే విషయాన్ని చెప్పారట .



ఆ నిశ్చితార్ధం పెటాకులు అయిపోయింది . ఆ తర్వాత శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరిగింది.  అలాగే ఆశీర్వదించారట నాగార్జున . ఇప్పుడు జైనబ్ రవ్జీ కి కూడా అలాంటి ఒక కండిషన్ పెట్టబోతున్నారట. పెళ్లయిన వన్ ఇయర్ కి చేతిలో బుల్లి మహాలక్ష్మిని పెట్టాలి అంటూ అఖిల్ - జైనబ్ ఇద్దరికీ చెప్పేసారట.  ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు కానీ పిల్లల ని కనడంలో సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు . ఆ కారణంగానే బహుశా నాగార్జున ఇలా చెప్పి ఉండొచ్చు అంటున్నారు జనాలు . చూద్దాం మరి నాగార్జున కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: