టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న యువ నటీమణులలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత కిలాడి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ రెండు మూవీలు కూడా ఈమెకు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి. ఆ తర్వాత మీనాక్షి "హిట్ ది సెకండ్ కేస్" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈమెకు తెలుగులో మొట్ట మొదటి విజయం ఈ సినిమా ద్వారా దక్కింది.

సినిమా తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు దక్కడం , అందులో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడం జరుగుతూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే మీనాక్షి చౌదరి ఓ నిర్మాణ సంస్థలో వరుస పెట్టి సినిమాలను చేస్తూ వస్తుంది. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మీనాక్షి చౌదరి నటించిన గుంటూరు కారం సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించారు. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్ వారు తాజాగా లక్కీ భాస్కర్ అనే సినిమాను కూడా నిర్మించారు. ఈ మూవీ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది.

మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తుంది. మొదట ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. కానీ ఈ సినిమా నుండి శ్రీ లీల తప్పుకోవడంతో ఈ మూవీ లో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా ఈ బ్యూటీ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో మూడవ సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: