గత రెండు దశాబ్దాల నుండి యాంకరింగ్ రంగంలో చెరిగిపోని ముద్ర వేసుకుంది యాంకర్ సుమా కనకాల.. సుమ కనకాల యాంకరింగ్ చేసిన సమయంలో ఝాన్సీ, ఉదయభాను వంటి ఎంతోమంది ఉన్నప్పటికీ వాళ్లందర్నీ దాటుకొని స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ యాంకర్ ఎవరు అనగానే అందరికీ సుమా కనకాల పేరే గుర్తుకు వచ్చేలా స్టార్ డం సంపాదించింది.అయితే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా చెక్కుచెదరని అందంతో ఇప్పటికీ యాంకరింగ్ రంగంలోనే కొనసాగుతోంది  సుమ. ఇప్పటి జనరేషన్ లో కొత్త యాంకర్స్ అయినటువంటి రష్మీ, శ్రీముఖి వంటి వాళ్ళు తమ గ్లామర్ తో యాంకరింగ్ రంగంలో రాణిస్తున్నా కూడా సుమా కనకాల మొదటి స్థానం మాత్రం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది.. 

అయితే అలాంటి యాంకర్ సుమకనకాల గంట కోసం షూటింగ్ కి వచ్చి అలాంటి పని చేసింది అంటూ ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ సింహ సుమ కనకాల నిజ స్వరూపాన్ని బయటపెట్టేశారు.మరి ఇంతకీ సుమ కనకాల చేసిన పని ఏంటి. నిఖిల్ సింహ ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా యూట్యూబర్ నిఖిల్ సింహ యాంకర్ సుమ కనకాలతో ఒక వీడియో చేశారు.అయితే ఆ వీడియోలో ఏముందంటే..సుమా కనకాల  షూటింగ్ కి వచ్చిన సమయంలో తన హ్యాండ్ బ్యాగ్ లో  ఏమేం తెచ్చుకుందో అవన్నీ నిఖిల్ సింహ ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ అందరికీ చూపించారు. అందులో సుమ కనకాల తెచ్చుకున్న లంచ్ బాక్స్ డైట్ సీక్రెట్ మొత్తం బయట పెట్టేశారు. 

సుమ కనకాల లంచ్ బాక్స్ లో కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తో పాటు ముద్దపప్పు రైస్,ఆల్మండ్ మిల్క్, ఫ్రూట్స్, అప్పడాలు, బెండకాయ పులుసు అంటూ అందులో నుండి ఒక్కొక్క ఐటెం తీస్తూ అందరికీ చూపించారు.. ఒక వన్ అవర్ షూటింగ్ కోసం సుమ గారు ఇన్ని ఐటమ్స్ బ్యాగ్ లో తెచ్చుకున్నారు అంటూ నిఖిల్ సింహా సుమా కనకాలతో చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. ఇక ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్ సుమ కనకాల ఇన్ని ఐటమ్స్ తింటుందా.. అంత తిన్న ఇంత తక్కువ వెయిట్ ఎలా ఉంటుందబ్బా  అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత మందేమో సుమ కనకాల నేచురల్ బ్యూటీ అంటూ ఇలా ఎంతోమంది ఈ వీడియో కింద స్పందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: