అలాగే తనని కూడా సౌత్ కి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసి రమ్మన్నారని చెప్పింది. అలా చేసి తిరిగి ముంబై వస్తే మంచి అవకాశాలు వస్తాయని తనతో అన్నారంట. అలా చెప్పక తాను కూడా సౌత్ లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిందని తెలిపింది. అలా ఫాతిమా సనా షేక్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అన్నింటికీ రెడీ కదా అని అడిగేవారని చెప్పుకొచ్చింది. తాను పాత్ర కోసం, సినిమా కోసం ఎంత కష్టమైన పడతానని చెప్పినట్లు తెలిపింది. అప్పుడు వాళ్లు తనకి ఆ విషయం అర్దం కాలేదని ఎక్కువగా ఫోకస్ పెట్టేవారు కాదని చెప్పింది.
అవకాశాల కోసం హైదారాబాద్ వెళ్తే ఒక్కోసారి కొంతమంది నిర్మాతలు వారి దగ్గరికి వెళ్ళాలి అని ఇదంతా కామన్ అని మాట్లాడారని చెప్పుకొచ్చింది. అందరూ అవకాశాల కోసం అలా ఉండరని.. తాను చెప్పి అక్కడినుండి వచ్చినట్లు చెప్పేదంట. నిర్మాతలలో చాలా మంది డైరెక్ట్ గానే నీవు వేర్వేరు వ్యక్తులని కలవాల్సి ఉంటుందని అనేవారంట. వాళ్లని వీళ్ళని కలవాల్సి ఉంటుందని.. అలా చేయాల్సి ఉంటుందని, ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పేవారని చెప్పుకొచ్చింది. నిజానికి ఇలా బాధింపబడిన వారి గురించి విన్న, ఆలోచించిన కూడా చాలా బాధ కలుగుతుందని ఫాతిమా సనా షేక్ తెలిపింది.