హీరోయిన్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి తనకంటూ ఒక సొంత బ్రాండ్ ని ఏర్పరచుకుంది. ఈమధ్య వరుస ప్లాపులు వచ్చినప్పటికీ కూడా తన రేంజ్ మాత్రం చెక్కుచెదరలేదని చెప్పవచ్చు.. రీసెంట్గా పుష్ప 2 చిత్రంలో కిసిక్ సాంగ్ లో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తన తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. రవితేజ ధమాకా సినిమాతో రూ .100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాలను అందుకుంది.



ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తూ ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. రీసెంట్గా స్క్రిప్టు పనులలో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. మరొకసారి రవితేజ తోనే ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ భోగవరపు దర్శకత్వం వహిస్తూ ఉండగా మాస్ జాతర గా టైటిల్ని రిలీజ్ చేశారు. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల శ్రీలీల తన డేట్స్ ఖాళీగా ఉన్నాయో లేవో చూడకుండా అడ్వాన్సులు పుచ్చుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


డేట్ల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే సినిమాలు ఆలస్యంగా ఉంటాయని అందుకే రవితేజ నటించిన మాస్ జాతర సినిమా కూడా కాస్త లేట్ అవుతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తన డేట్ల విషయంలో కూడా డైరెక్టర్లకు నిర్మాతకు శ్రీ లీల మధ్య క్లాస్ వస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో చాలామంది నిర్మాతలు, డైరెక్టర్లు సైతం ఇతర హీరోయిన్లను సెలెక్ట్ చేసుకోవడానికి మక్కువ చూపిస్తున్నారట. అందుకే శ్రీలీల తన కాల్ షీట్స్ విషయంలో జాగ్రత్త పడకపోతే వచ్చిన అవకాశాలు కూడా వెళ్లిపోతాయని అభిమానులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: