టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. అలాగే తెలుగు అమ్మాయి అంజలి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక స్క్రీన్‌పై లేనప్పటికీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చాటుకునే అతికొద్ది మంది హీరోల్లో చరణ్‌ ఒకరు.
ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వాటిలో జరగండి జరగండి జరగండి పాట మాత్రం ఒక ఊపు ఊపింది. అయితే ఆ పాటకి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో కదా. నిజంగానే ఓ అభిమాని ఈ పాటకు ఎన్టీఆర్ డాన్స్ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. 

ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు సినిమాలోని కందిచేను కాడ కన్నువేసినానే పాటలో డాన్స్ స్టెప్స్ ని.. జరగండి పాటతో మిక్స్ చేసి వీడియో పెట్టారు. ఈ పాటలో అందాల భామలు శ్రియ, జెనీలియాతో ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు వేశారు. ఈ పాటను చూసిన నెటిజన్లు అద్భుతంగా ఉంది ఈ వెర్సన్ జరగండి పాట అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అయితే ఈ పాటనే ఒరిజినల్ లాగా ఉంది అంటూ అంటున్నారు. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న ఆర్‌సీ 16 సినిమాలో హీరోయిన్ గా జాన్వీకపూర్ నటిస్తుంది. రామ్ చరణ్ ఇప్పుడు ఈ సినిమా పనుల్లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా జగపతి బాబు, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: