ఇక విషయం ఏమిటంటే, వారి బాండింగ్ గురించి తాజాగా నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య మరోసారి గుర్తు మీడియా వేదికగా గుర్తు చేసాడు. విషయం ఏమిటంటే, నిన్న చెన్నైలో జరిగిన ‘తండేల్’ ఈవెంట్ కి కార్తీ గెస్ట్ గా వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ… "చెన్నైకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా మూలాలు చెన్నైతో ముడిపడి ఉన్నాయన్న సంగతి నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అదేవిధంగా నా సినిమా ‘తండేల్’ చెన్నైలో కూడా రిలీజ్ అవుతుండడం అనేది నాకు సంతోషంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కార్తీ సార్ ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్. నేను ఎప్పుడు చెన్నైకి వెళ్తున్నాను అని చెప్పినా.. మా నాన్న గారు(నాగార్జున) నాకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు.. ‘నేను కార్తీకి ఫోన్ చేస్తాను.. అని చెబుతూ ఉంటాడు. ‘కార్తీ మా ఫ్యామిలీ మెంబెర్’ అని నాన్న ఎక్కువగా చెబుతుంటారు!" అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
ఈ సందర్భంగా నాగ చైతన్య కార్తీ ‘తండేల్’ ని ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు థాంక్స్ చెప్పాడు. కార్తీ రాక తనకెంతో బూస్ట్ ఇచ్చిందని, కార్తీని తన సొంత అన్నలాగా ఫీల్ అవుతానని చెప్పుకొచ్చాడు. అదే విధంగా నాగ చైతన్యని చెన్నై మీడియాకి పరిచయం చేసింది దర్శకులు వెంకట్ ప్రభు గారని, ఆయన కూడా ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.