అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంతో వచ్చిన పుష్ప 2 మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద ప‌లు రికార్డుల‌ను బ్రేక్ చేసింది. ఆర్ఆర్ ఆర్, కల్కి, బాహుబలి 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులను సైతం అల్లు అర్జున్ పుష్ప 2 బ్రేక్ చేసింది. సంక్రాంతి పండుగకు ముందే ఈ సినిమా రూ. 1830 ప్లస్ కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించింది దీంతో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సెకండ్ మూవీగా నిలిచింది. అదేవిధంగా 2024 ఏడాదిలో అత్యధిక క‌లెక్ష‌న్స్ వసూలు చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2.అలాగే.. ఇటీవల సంక్రాంతి కానుకగా పుష్ప 2లో 20 నిమిషాల ఫుటేజీ యాడ్ చేసి.. 'పుష్ప 2 రీలోడెడ్' వెర్షన్ పేరిట రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ . దీంతో కొన్ని చోట్ల పుష్ప 2 కలెక్షన్లు మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఇలా పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 1,900 కోట్లపైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే.. దాదాపు రూ. 2000 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లుగా ఓ పోస్టర్ ఇటీవల బాగా వైరల్ అయింది. దీని బట్టి పుష్ప 2 ఎలాంటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.ఇదిలావుండగా పుష్ప 2: ది రూల్' ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఇగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా.. ఓటీటీలోకి వచ్చేసింది. 'పుష్ప 2 రీ లోడెడ్' వెర్షన్ పేరుతో గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. 23 నిమిషాల ఎక్స్‌ట్రా ర‌న్‌టైమ్‌తో ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్స్ ల్లో మాత్రమే విడుదలైంది. క‌న్న‌డ వెర్ష‌న్‌ను త్వ‌ర‌లో విడుదల చేస్తామని నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది.ఈ క్రమంలోనే పుష్ప 2మూవీకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది. టాప్ 10మూవీస్లో ఈ సినిమా నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతుంది. ఈ మూవీ గత నెల 30న ఓటిటి లో విడుదలైన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: