ఈ సినిమా హిట్ అవ్వడానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సాయి పల్లవి ఒక ఎత్తు. ఆమె ఒక సినిమాలో నటిస్తుందంటే చాలు ఆ సినిమా పక్క హిట్ కోడతుందని ముందే ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆమె సినిమాలను సెలెక్ట్ చేసుకునే విధానమే వేరు. అలాగే ఆ సినిమాలో సాయి పల్లవి నటన మామూలుగా ఉండదు. ఇక ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బుజ్జితల్లి పాటతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా హిందీ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'తండేల్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. హీరోగా నాగ చైతన్య అద్బుతంగా నటించాడు. ఈ మూవీలో హృదయాన్ని హత్తుకునేలా భావోద్వేగాలు ఉన్నాయి. ఇక లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్యతో నటించడం మంచి అనుభవం' అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఆతర్వాత హీరో నాగ చైతన్య కూడా మాట్లాడుతూ.. ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథతో రూపొందించారని తెలిపాడు. ఈ సినిమా టైలర్ ని అమీర్ ఖాన్ విడుదల చేయడం తనకు చాలా సంతోషాన్ని, బలాన్ని ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.