టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు నాగ వంశీ కొంత కాలం క్రితం చెప్పుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

కానీ VD 12 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది అని విజయ్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అందుకు ఒక ప్రత్యేక కారణాన్ని కూడా వారు చూపిస్తున్నారు. అదేమిటి అంటే ... సితార ఎంటర్టైన్మెంట్ వారు ఈ మధ్య కాలంలో నిర్మించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. పోయిన సంవత్సరం ఈ బ్యానర్ వారు మొదటగా గుంటూరు కారం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చిన అద్భుతమైన కలెక్షన్లను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యానర్ నుండి వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.

ఇక కొంత కాలం క్రితం ఈ బ్యానర్ వారు లక్కీ భాస్కర్ అనే సినిమాను రూపొందించగా ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ బ్యానర్ వారు డాకు మహారాజ్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఈ మధ్య కాలంలో ఈ బ్యానర్ వారు నిర్మించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకుంటు ఉండడంతో VD 12 సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని ఆశాభావాన్ని విజయ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd