టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి జనాలకు పరిచయం అక్కర్లేదు. అవును, ఇపుడు రాజమౌళి ఘనత దిగంతాలకు చేరింది. ఇపుడు ప్రపంచంలోనే పేరు మోసిన సినిమా దర్శకుడిగా జక్కన్నకి పేరు ఉంది. దానికి కారణం rrr సినిమాకి ఆస్కార్ అవార్డు వారించడమే. ఇక అసలు విషయంలోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్‌ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ వరల్డ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీలో బాలీవుడ్ బడా హీరోయిన్ ప్రియాంక చోప్రాని కథానాయికగా ఎంపిక చేసుకుంది చిత్ర యూనిట్.

ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ప్రియాంక చోప్రా హైదరాబాద్‌ చేరుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఈ సినిమా షూటింగ్ కోసమనే భాగ్యనగరం చేరుకుంది అని టాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది. కాగా నిన్నటికి నిన్న ఆమె సంగీత దర్శకుడు కీరవాణితో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రియాంక చోప్రా మహేష్ బాబుకి జోడి కానుందని ఖరారు చేసుకున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ప్రియాంకచోప్రా భారీ మొత్తంలో పారితోషికం అందుకోనుందంటూ వార్తలు వస్తున్నాయి.

అవును... ఈ సినిమాకి ఆమె దాదాపు 30కోట్ల భారీ పారితోషికం తీసుకోనున్నారట. ఒకవేళ ఈ వార్తే నిజమైతే.. భారతీయ సినిమాలో ఓ కథానాయిక స్వీకరించే అత్యధిక పారితోషికం ఇదే అవుతుంది అని సినిమా పండితులు చెబుతున్నారు. ముంబయి మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమా కోసం ప్రియాంకచోప్రా దాదాపు 50కోట్ల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేయగా దాదాపు నెలకుపైగా సాగిన చర్చల అనంతరం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్‌ను 30కోట్లకు ఫిక్స్‌ చేసుకున్నారని సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా భారతీయ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకోబోతున్న కథానాయికగా ప్రియాంక చోప్రా సరకొత్త ఘనతను సాధించబోతున్నది ట్రేడ్‌వర్గాలు అయితే ఇప్పటికే కధనాలు ప్రచురించాయి. ఆఫ్రికన్‌ జంగిల్‌ అడ్వెంచర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: