కొన్ని సంవత్సరాల క్రితం మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఓ టీ టీ కంటెంట్ ను చూసేవారు కాదు. ఎప్పుడైతే దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాలలో కూడా కొంత కాలం పాటు థియేటర్స్ ను మూసివేశారు. అలాగే టీవీల్లో కూడా కొత్త కంటెంట్ కరువైపోయింది. దానితో ఓ టీ టీ లో ఉన్న కంటెంట్ చూడడానికి తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు. దానితో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ఉన్న కంటెంట్ ను చూసే తెలుగు ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. దానితో ఇప్పటికే కొన్ని తెలుగు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి.

ఇలా ఓ టి టి ప్లాట్ ఫామ్ లు భారీగా పెరిగిపోవడంతో సినిమా నిర్మాతలకు కూడా ఇది మంచి ఆదాయ వనరుగా మారింది. ఇంతకుముందు నిర్మాతలకు సినిమాల ద్వారా థియేటర్ నుండి మాత్రమే కాకుండా సాటిలైట్ , మ్యూజిక్ హక్కుల ద్వారా మరియు డబ్బింగ్ హక్కుల ద్వారా డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు వీటితో పాటు అదనంగా డిజిటల్ హక్కుల ద్వారా కూడా డబ్బులు రావడం మొదలు అయింది. ఓ టి టి సంస్థలు భారీగా పెరిగిపోయిన కొన్ని సినిమాలు మాత్రం ఓ టీ టీ లోకి ఇప్పటికీ రానివి కూడా ఉన్నాయి. అలాంటి వారిలో మంచి క్రేజ్ ఉన్న అఖిల్ , శర్వానంద్ సినిమాలు కూడా ఉన్నాయి.

అఖిల్ ఆఖరుగా ఏజెంట్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఇప్పటికీ కూడా ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇక శర్వానంద్ ఆఖరుగా మనమే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా ఇప్పటివరకు ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వలేదు. ఇలా మంచి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు హీరోల సినిమాలు విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటికి కూడా ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: