టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన స్టార్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇకపోతే తారక్ తన కెరియర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అందులో మంచి విజయాలను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో తారక్ "బొమ్మరిల్లు" కథను భాస్కర్ మొదట నాకు వినిపించాడు. అని కానీ నా ఈమేజ్ కి ఆ సినిమా సెట్ కాదు అనే ఉద్దేశంలో దాన్ని వదిలేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక బొమ్మరిల్లు సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

అలాగే భద్ర సినిమా కథను బోయపాటి శ్రీను మొదట తనకే వినిపించినట్లు , కానీ ఆ సినిమాను తాను వదిలేసినందుకు బాధపడుతున్నట్లు కూడా తారక్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా తారక్ ఓ సినిమాను రిజెక్ట్ చేశాడు అనే వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే బుచ్చిబాబు మొదట ఈ కథతో ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని అనుకున్నట్లు అందులో భాగంగా ఆయనకు కథను కూడా వివరించగా ఆయన మాత్రం ఆ కథను రిజెక్ట్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక చాలా మంది బుచ్చిబాబు , చరణ్ తో తెరకెక్కిస్తున్న సినిమా కథ అద్భుతం అని చెప్పుకొచ్చారు. దానితో అంత మంది సూపర్ అంటున్న కథను ఎందుకు తారక్ వదిలేసాడా అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: