సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒక్క తమిళనాడు కాదు మొత్తం సౌత్ ఇండియాలోనే ఎంతో ఫేమస్ అయిన వ్యక్త రజినీకాంత్. తన నటనతో రజినీకాంత్ ప్రేక్షకుల మనసులను తన సొంతం చేసుకున్నారు. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ప్రేక్షకులకు పండుగానే చెప్పాలి. అయితే రజినీకాంత్ చాలా సినిమాలలో చాలా మంచి పాత్రలలో నటించారు.
ఇక స్టార్ రజినీకాంత్ అంటే కేవలం తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. 7 పదుల వయసులోనూ ఇండస్ట్రీ హిట్ రికార్డులు తిరగరాయడం ఒక్క రజనీకాంత్‌కే చెల్లింది. అంతేకాదు.. ఆయన ఇండియన్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో టాప్ 5 ప్లేస్‌లలో ఉన్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ ఒక్కో సినిమాకు అక్షరాల రూ.180 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
అయితే రజినీ కాంత్ గురించి సింగర్ బాలసుబ్రహ్మణ్యం గతంలో మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి. అందులో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 'తలైవాకు చాలా గొప్ప వినయం ఉంది. శివాజీ గణేషన్ చివరి రోజుల్లో ఆయనను రజినీ సినిమాలో నటించమని అడిగారు. దానికి ఆయన నాకు ఓపిక లేదని కావాలంటే ఉదయం 6 నుండి మధ్యానం ఒంటి గంట వరకు చేస్తానని చెప్పారు. అయితే ఆ సమయంలో రజినీకి 5 సినిమాలు ఉన్నప్పటికీ.. ఉదయం 5:45కె మేకప్ వేసుకొని రెడీగా ఉండేవారు. అది చూసిన శివాజీకి ఆశ్చర్యమేసి రజిని మూడు షిఫ్ట్ లు పని చేస్తున్నాడు.. అసలు ఇంత పొద్దున ఎలా వస్తున్నాడని పక్కన వాళ్లని అడిగాడు. దానికి వాళ్లు.. ఆయన అసలు ఇంటికి వెళ్లడం లేదు సర్, రాత్రి ఒంటి గంటకు షూటింగ్ అవ్వగానే మేకప్ రూమ్ లోనే పడుకుంటున్నారని చెప్పారు.' రజినీ కాంత్ ది అంతా గొప్ప వ్యక్తిత్వం అని సింగర్ బాలసుబ్రహ్మణ్యం మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: