ఇప్పటివరకు ఎంతో మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా తక్కువ శాతం మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ సక్సెస్ అయ్యి ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలు ఎవరు అనే విషయం తెలుసుకుందాం.

తాప్సి : ఈ నటి ఝుమ్మంది నాదం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈమె తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. ఇక హిందీలో ప్రస్తుతం ఈమె స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

కృతి సనన్ : ఈ బ్యూటీ 1 నేనొక్కడినే అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమె దోచేయ్ అనే మరో తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. హిందీ లో అనేక సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

దిశా పటాని : లోఫర్ అనే మూవీ తో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె హిందీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. హిందీ లో ఇప్పటి వరకు అనేక సినిమాలో నటించిన ఈ నటి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: