యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న హైలీ యాంటీసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'తండేల్'. చందు మొండేటి దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్లకు సంబంధించి ఒక్కో భాషలో ఒక్కో హీరో సపోర్టుగా నిలవడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది.ఇదిలావుండగా చెన్నై లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ కు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు.ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో అతను కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవి ఇప్పుడు హైలైట్ గా నిలిచాయి.తండేల్’ కథ మొదట అతనికి చెప్పినప్పుడు. మణిరత్నం తెరకెక్కించిన కడల్ గుర్తుకొచ్చిందట. దేవి ఇలా అనడంతో అంతా ఇది కడల్ స్ఫూర్తితో రూపొందిందా? అని అంతా అనుకుంటున్నారు. కానీ దానికి దీనికి సంబంధమే ఉండదు. కడల్ సినిమాలో హీరో మత్స్యకారుడు. కానీ అందులో క్రిస్టియానిటీ, అలాగే బైబిల్ లోని కొన్ని పాత్రలు, అందులోని థీమ్ వీటన్నిటినీ బేస్ చేసుకుని దర్శకుడు మణిరత్నం ఆ కథని డిజైన్ చేశాడు.అది కూడా ప్రేమకథ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 కానీ తండేల్ కథ పూర్తిగా వేరు. శ్రీకాకుళంలో జరిగిన ఓ యదార్థ సంఘటనని ఆధారం చేసుకుని దర్శకుడు చందూ మొండేటి  ఈ చిత్రాన్ని తీశాడు. పాకిస్తాన్ సైనికులకు దొరికిపోయిన 20 మంది మత్స్యకారులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చివరికి ఎలా బయటపడ్డారు అనేది ‘తండేల్’ కథ.కానీ ఇందులో కూడా లవ్ స్టోరీ హైలెట్ అవుతుంది అని ప్రతి సందర్భంలోనూ టీం గుర్తు చేస్తూనే ఉంది.అలాగే ముంబైలో జరిగిన 'తండేల్' హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.అలాగే నిన్న ముంబై లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు కూడా హాజరయ్యారు దేవిశ్రీ.ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ తండేల్ మూవీకి అమీర్ ఖాన్ సపోర్ట్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనను కలవడం గర్వంగా కూడా ఉంది. ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది. నిజానికి ముంబై ఆడియన్స్ నా పాటలకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వి లవ్ యు అమీర్ సార్ అంటూ సమాధానం చెప్పారు. అలాగే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: