
కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా చూడడానికి బన్నీ సంధ్య థియేటర్ కి వెళ్ళిన మూమెంట్లో అక్కడ తొక్కిసలాట జరగడం.. రేవతి అనే మహిళ మృతి చెందడం ..ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత తమ సినిమాకి పబ్లిసిటీ చేసుకోవాలన్న హీరోస్ భయపడిపోతున్నారు. హీరోయిన్స్ అయితే అసలు ఎక్కడికి రాము మేము అంటూ చేతులెత్తేస్తున్నారు . కాగా ఇలాంటి మూమెంట్లోనే సినీ మండలి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ఉండే బడా స్టార్స్ అందరిని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీనిపై నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోవాలి ..సినిమాకి స్టార్స్ ప్రమోషన్స్ చేకపోతే ప్రొడ్యూసర్స్ నష్టాలుపాలు అవుతారు అంటూ చర్చించబోతున్నారట . సినీ స్టార్స్ అందరూ కూడా ఈ మీటింగ్ లో పాల్గొనాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. మరీ ముఖ్యంగా ప్రభాస్ - బన్నీ - మహేష్ బాబు - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ - చిరంజీవి లాంటి బడా స్టార్స్ కూడా ఈ మీటింగ్ కి కచ్చితంగా అటెండ్ అవ్వాలి అంటూ సినీ సభ్యులు కోరుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అందరి స్టార్స్ ని ఒకే ఫ్రేమ్లో చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు..!