సినిమా ఇండస్ట్రీలో అయినా మామూలు సమాజంలో ఆయన మనకంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారిని వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటాం. అలా సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమందితో మంచి బాండింగ్ ఉంటే వరుసలు కలుపుతూ మాట్లాడుతారు. అయితే అలా కీర్తి సురేష్ కూడా ఒక హీరోని అంకుల్ అని పిలిచేదట. కానీ ఆ హీరో మాత్రం నన్ను ఇంకోసారి అంకుల్ అని పిలవద్దు అని అన్నారట.మరి కీర్తి సురేష్ ఏ హీరోని అంకుల్ అని పిలిచేది అనేది చూద్దాం.. కీర్తి సురేష్ బాలనటి అనే సంగతి మనకు తెలిసిందే. ఆమె తల్లి ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించడంతో ఆమె కూడా బాలనటిగా సినిమాల్లోకి వచ్చింది. అలా చిన్న తనంలో ఉన్న సమయంలో హీరో దిలీప్ నటించిన ఓ సినిమాలో ఆయన కూతురు పాత్రలో నటించిందట.

అయితే అప్పటినుండి దిలీప్ ని అంకుల్ అని పిలవడం మొదలెట్టేసిందట. ఆ తర్వాత కొద్ది రోజులకే దిలీప్ నటించిన రింగు మాస్టర్ సినిమాలో ఆయనకి ప్రేయసిరాలి పాత్రలో  కీర్తి సురేష్ నటించింది.అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ ఎక్కడ తనని అంకుల్ అని పిలుస్తుందోనని భయపడ్డా దిలీప్ వెంటనే కీర్తి సురేష్ దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను అంకుల్ అని అయితే పిలువకు.. కావాలంటే చేటా అంటే అన్నయ్య అని పిలువు.

అంతేకానీ అంకుల్ అనకు అని చెప్పారట.దాంతో కీర్తి సురేష్ కూడా ఎవరికి కంఫర్ట్ జోన్ వారిది కాబట్టి అప్పటినుండి దిలీప్ ని అన్నయ్య అని పిలిచేదట. అలా ఎవరికైతే కూతురు పాత్రలో నటించిందో మళ్లీ ఆ హీరోకే ప్రియురాలు పాత్రలో నటించడం జరిగింది అంటూ కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ వైవాహిక జీవితం గురించి కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: