ఇక రీసెంట్ గానే రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమా మీద మరింత అంచనాలను పెంచడంతో సినిమా యూనిట్ సక్సెస్ అయింది. అలాగే మ్యాడ్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ మ్యాడ్ స్క్వేర్ .. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులు ముందుకు వచ్చి మ్యాడ్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది. అయితే ముందుగా ఎలాంటి ప్లానింగ్ లేకపోయినా సీక్వెల్ ను లైన్లో పెట్టేసారు మేకర్స్ .. అలాగే సినిమా మీద అంచనాలు కూడా పెంచేశారు .. మొదటి భాగంలో స్టార్ ఇమేజ్ గురించి పెద్దగా ఎలాంటి అంచనాలు లేకపోయినా ఈ సీక్వల్ ను మాత్రం మల్టీ స్టార్ గాను చూస్తున్నారు సినీ ప్రేక్షకులు.
ఇలా రాబోయే సినిమాల్లో అంచనాలు పనిచేస్తున్న మరో క్రేజీ మల్టీస్టారర్ మిరాయ్ .. హనుమాన్ సినిమాతో సంచలనాలు క్రియేట్ చేసిన తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ హీరో ఫిలిం మిరాయ్. ఇక ఈ సినిమాలో కూడా మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు .. ఇక దీంతో ఈ సినిమాని కూడా యంగ్ హీరోల మల్టీసారర్ సినిమా గానే చూస్తున్నారు ప్రేక్షకులు .. ఇలా యంగ్ హీరోలు అందరూ వరుస పెట్టి మల్టీపారర్‌లను ప్లాన్ చేసుకోవడంతో .. ఈ జోనర్ లో వస్తున్న సినిమాలు మీద అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.